సింధు ప్రజల నాగరికత, సంస్కృతి,సంప్రదాయాలు, తాత్విక చింతన ...

ఆర్యులు ఇరాక్ నుండి వలస రాకపూర్వం భారత దేశంలో వున్న సింధూ సంస్కృతి గురించి జరిగిన తవ్వకాలలో బయటపడిన ఆనవాల్ల ద్వారా కొంత తెలిసింది. అప్పటికే సింధూలిపి కూడా ఉండింది. దాన్ని ఇప్పటివరకు అర్థం చేసుకోలేకపోయారు. అందువల్ల దీన్ని ‘ప్రోటో హిస్టారిక్’ యుగం (సంధి కాలపు చారిత్రక యుగం) అని పిలుస్తారు. ఆనాటి ప్రజలకు రాయడం, చదవడం కూడా తెలుసు. ఉపయోగించిన లోహం ‘కంచు’. అందుకే సింధు నాగరికతను ‘కాంస్య యుగపు’ నాగరికత అని కూడా పిలుస్తారు. ఈ నాగరికత శిలాయుగం నుంచి లోహ యుగానికి మార్పు చెందుతున్న కాలంలో అభివృద్ధి చెందింది. సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలు.. మెసపటోమియా (ఇరాక్) (యూప్రటీస్, టైగ్రిస్); ఈజిప్ట్ (నైలు నది); చైనా (హోయాంగ్ హో) మొదలైనవి. సమకాలీన నాగరికతల కంటే సింధు నాగరికత 6 అంశాల్లో విశిష్టమైందిగా గుర్తింపు పొందింది. వారు ఇటుకలతో రెండంతస్థుల మేడలు కూడా కట్టుకున్నారు. మురుగుకాలువలు నిర్మించారు. ఇళ్ళలో స్నానాలగదులుండేవి. స్విమ్మింగ్ పూల్ లాంటి ఒక కోనేరు ఒకటి ఉండేది. రుగ్వేదగానం చేసే ఆర్యుల కన్నా సింధు ప్రజలే నాగరికులని చరిత్రకారుల అభిప్రాయం. అయితే సింధూ సంస్కృతి ఎలా పతనమైందో ఇప్పటికీ ఎవ్వరూ కనుగొన లేకపోయారు. అయితే సింధు నది కి వచ్చిన వరదల వల్ల సింధు సంస్కృతి నాశమైందని కొందరు భావిస్తున్నారు. ఆర్యుల దాడుల కారణంగా నేటి ఆధునిక సంస్కృతి తో సమానంగా ఉన్న ఆనాటి సంస్కృతి పతనమైంది మరికొందరు భావిస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఇంద్రుని పురందరేశ్వరుడని( నగర ధ్వంసకుడు) రుగ్వేదం లో కీర్తించడమేనని చెప్పారు. సింధు ప్రజల తాత్విక చింతనే నేటి తాత్విక చింతన లో అంతర్భాగంగా ఉండి తీరుతుంది. సింధు ప్రజలు నేడు మనం పాటిస్తున్న ఆధునిక విధానాలను వారు అవలంబించారు. వారికో భాష ఉంది.దానికో బొమ్మలలిపి ఉంది. ఇది స్వదేశీ లిపి.దీన్ని 1853లో కనుగొన్నారు. అయితే దానిని ఇంతవరకు ఎవరూ చదవలేకపోయారు. వీరి జీవనవిధానం క్రీ.పూ.6000 నుండి క్రీపూ.1750 వరకూ సాగింది. వీరు హరప్పా మొహంజదారో ప్రాంతం లో నివసించారు.ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్లో ని సింధ్,పంజాబ్ ప్రావిన్సులలో,పశ్చమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్స్ వరకు ఉంది.వీరు నేటి నాగరిక విధానాలను ఆనాడే అవలంబించారు. తరువాత కాలంలో ఆర్యులతో వీరు కలిసి పోవడమో, దూరంగా పారిపోయి దక్షిణ భారత దేశంలో కి రావవడమో జరిగిందని పరిశోధకులు భావిస్తున్నారు. సింధు ప్రాంత ప్రజలు అమ్మతల్లిని పూజించేవారు.ఆ తరువాత అగ్నిని అగ్ని దేవుని గా గాలిని వాయుదేవుని గా ఆరోగ్యాన్నిచ్చేవారిని అశ్వినీ దేవతలుగా వర్షాలను వరుణదేవునిగా పూజించారు.ఇలా సమస్త జీవజాలం లో దైవాన్ని చూసుకున్నారు. సింధు నాగరికతా కాలంలో మాతృస్వామిక వ్యవస్థ ఉంది కనుక స్త్రీ ఆరాధ్య దైవం అయ్యింది. వీళ్ళ జీవన వ్యవహారాల్లో గ్రామ దేవతలు భాగమయ్యాయి. ఈ దేవత గ్రామాన్ని చల్లగా చూస్తూ, అంటు వ్యాధుల నుండి రక్షిస్తూ, పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ, భూత ప్రేతాలనుండి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపుకాస్తుందని నమ్మేవారు. అందువల్లే సింధూ ప్రజలు ఎక్కువగా అమ్మతల్లిని అంటే శక్తిని ఆరాధించేవారు. పశుపతి అనే పురుష దేవుడిని కూడా కొలిచేవారు. వేదసాహిత్యంలో ఈ దేవుడు లేడు. పశుపతిని ముద్రిక ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వేదికపై కూర్చున్న ఆరు ముఖాల మూర్తి, ఆ వేదికను ఆవరించి ఏనుగు, పులి, ఖడ్గ మృగం, మహిషం ఉండేవి. రావి చెట్టు, స్వస్తిక్ గుర్తు, జంతువులు, చెట్లు, నాగుల్ని ,అగ్ని ని కూడాపూజించేవారు.పశువులను బలిచ్చేవారు. ఆంధ్రులు నాగుల్ని పూజిస్తారని గుర్తించాలి.బహుశా సింధు ప్రజలే దక్షిణ భారతదేశంలో కి వలస వచ్చి ఉండొచ్చు. మూపురంతో కూడిన ఎద్దు వీరికి ఇష్టమైన జంతువు. లింగపూజ వీరితోనే ప్రారంభమైంది. జంతువులను బలిచ్చేవారు. వీరికి తెలియని జంతువు గుర్రం. వేదసాహిత్యాన్ని బట్టి మనకు తెలిసేదేమంటే వేదకాలపు ఆర్యులకు,సింధూ ప్రజలకు మధ్య ఘర్షణలు జరిగాయి.వేదాలలో అక్కడక్కడా వీరి ప్రస్తావన ఆధారంగా సింధూ ప్రజలు శివున్ని(పశుపతి), శక్తి (అమ్మతల్లి)ని, లింగాన్ని ఆరాధించే వారని తెలుస్తోంది.అక్కడ లభించిన విగ్రహాలు దీన్ని రూఢీ చేశాయి. సింధూప్రజలు మనిషి మరణిస్తే పూడ్చేవారు. తరువాత వలస వచ్చిన ఆర్యులు మాత్రం శవాన్ని కాల్చేవారు(దహనం చేసేవారు). సింధు నాగరికత మిగిలిన నాగరికతల కంటే వైశాల్యంలో పెద్దది. ఇది 1.3 మి.చ.కి.మీ.లలో విస్తరించి ఉంది. దీని సరిహద్దులు ఉత్తరాన జమ్ముకశ్మీర్‌లోని మండా నుంచి దక్షిణాన మహారాష్ర్టలోని దైమాబాద్ వరకు, తూర్పున ఉత్తరప్రదేశ్‌లోని అలింగీర్ నుంచి పాకిస్తాన్‌లోని (సుక్త-జందార్) వరకు విస్తరించి ఉంది. పట్టణాలు గ్రిడ్ వ్యవస్థలో, ప్రధాన వీధులు ఉత్తర-దక్షిణాలుగా, ఉప వీధులు తూర్పు -పడమరలుగా దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నాయి. సింధు ప్రజలు ఇళ్ల నిర్మాణంలో కాల్చిన ఇటుకలను ఉపయోగించటాన్ని ప్రత్యేక అంశంగా చెప్పొచ్చు (దీనిలోనే సింధు ప్రజలు పరిపక్వత సాధించారు). ఈ నాగరికతలో పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. భూగర్భ మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. మురుగు నీటి కోసం ఇంకుడు గుంతలు తవ్వటం ఈ నాగరికతలోని ప్రత్యేకత. సాంకేతిక పరిజ్ఞానంలో మిగిలిన నాగరికతల కంటే గొప్పది. సింధు ప్రజలు ప్రపంచంలో తొలిసారి పత్తిని పండించారు. రాతితో చెక్కిన నటరాజ విగ్రహం వెలుగుచూసింది. చెక్కతో తయారు చేసిన శవపేటికలు. కోటకు వెలుపల చిన్నచిన్న గదులతో కూడిన నిర్మాణాలు. కంచుతో పోత పోసిన నాట్యగత్తె విగ్రహం లభించింది. రాతితో తయారుచేసిన పశుపతి మహాదేవుని విగ్రహం దొరికింది. కాల్చిన ఇటుకలతో కూడిన మానవ నిర్మిత నౌకాశ్రయం ఉన్న పట్టణం. మొదటిసారిగా వరి పండించిన ఆనవాళ్లు లభించాయి. ఎక్కువగా ముద్రికలు దొరికాయి. సతి ఆచారానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. కొలిచే ప్రమాణం (త్రాసు, కొలబద్ద) వంటి పనిముట్లు దొరికాయి. కాళీభంగన్‌లా అగ్ని గుండం ఆనవాళ్లు ఇక్కడ బయల్పడ్డాయి. చదరంగం లాంటి ఆటకు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయి.మేలు రకపు బార్లీ, ఆవాలను ఉపయోగించిన, పండించిన ఆనవాళ్లు దొరికాయి.ఇక్కడ రాతితో చేసిన బాణాలు బయటపడ్డాయి. రూపార్ లో కుండల తయారీ ఆనవాళ్లు లభించాయి. సుర్కటోడాలో గుర్రం అవశేషాలు లభించిన ఏకైక పట్టణం.